శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (11:22 IST)

జైలర్ రోల్ కోసం బాలకృష్ణను అనుకున్నా.. అది జరగలేదు..

Jailer
జైలర్ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే ఈ చిత్రం రూ. 91 కోట్ల గ్రాస్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రూ. ఏడు కోట్ల షేర్ వసూలు చేసింది. 
 
మరోవైపు ఈ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో ఓ పాత్రకు బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నానని చెప్పారు. కానీ అది కుదరలేదని దిలీప్ కుమార్ తెలిపారు. 
 
ఓ పోలీసు పాత్ర కోసం బాలయ్యను అనుకున్నానని... అయితే, కథకు తగ్గట్టుగా ఆ పాత్రను క్రియేట్ చేయలేకపోయానని వెల్లడించారు. 
 
పాత్ర సరిగా కుదరనప్పుడు బాలయ్యను ఎంపిక చేయడం సరికాదని భావించానని తెలిపారు. అందుకే బాలయ్యను సంప్రదించలేదని తెలిపారు. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేస్తానేమో అని అన్నారు.