గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (18:59 IST)

జైలర్ వసూళ్ల సునామీ, రజినీకాంత్‌కి నిర్మాత మారన్ రూ. 1.26 కోట్ల బిఎండబ్ల్యు కారు గిఫ్ట్

Maran-Rajinikanth
రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రం ఇటీవల విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 500 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. దీనితో నిర్మాత కళానిధి మారన్ ఖుషీఖుషీగా వున్నారు. లాభాల పంట పండుతుండటంతో వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ముట్టజెప్పారు. 
 
చెక్ రూపంలో కొంత మొత్తాన్ని అందించారు. ఆ మొత్తం ఎంత అనేది తెలియరాలేదు. దీనితో పాటు సుమారు రూ. 1.26 కోట్లు విలువ చేసే బిఎండబ్ల్యు కారును గిఫ్టుగా ఇచ్చారు. రజినీ ఇంటికి రెండు బిఎండబ్ల్యు కార్లను తీసుకుని వచ్చి, వాటిలో ఏది కావాలో ఎంపిక చేసుకోవాలని ఆయనను అడిగారు. రజినీ తనకు నచ్చిన బీఎండబ్ల్యు ఎక్స్ 7 కారును ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.