1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2016 (15:49 IST)

బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జనతా గ్యారేజ్.. గుంటూరులో రూ.2.28 కోట్ల షేర్

బాహుబలిని జనతా గ్యారేజ్ బీట్ చేసిందా? నిజమా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమే అంటున్నాయి గణాంకాలు. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ

బాహుబలిని జనతా గ్యారేజ్ బీట్ చేసిందా? నిజమా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమే అంటున్నాయి గణాంకాలు. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఫస్ట్ షో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సాయంత్రం కల్లా అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న జనతా గ్యారేజ్..  ఫస్ట్ డే టాప్ కలెక్షన్స్ వసూళ్లలో రికార్డు సాధించింది.
 
ఇంకా ఎన్టీఆర్‌కు మంచి పట్టు ఉన్న గుంటూరు, కృష్ణ ఏరియాల్లో జనతా గ్యారేజ్, బాహుబలి రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. కృష్ణా జిల్లాలో బాహుబలి రూ.1.98 కోట్లు సాధించగా, జనతా గ్యారేజ్ 1.54 కోట్ల మాత్రమే షేర్లు రాబట్టింది. అయితే గుంటూరులో బాహుబలి రూ.2.54 కోట్ల రికార్డును గ్యారేజ్ రూ.2.58 కోట్ల రూపాయల వాటాలతో అధిగమించింది. వైజాగ్‌లో బాహుబలి రూ. 1.75 కోట్లు సాధించగా, గ్యారేజ్ రూ.2.29 కోట్లు రాబట్టింది. తూర్పు గోదావరిలోనూ రూ.1.98 కోట్ల బాహుబలి రికార్డును గ్యారేజ్ రూ. 2.28 కోట్లతో బ్రేక్ చేసింది. వరుస సెలవులు రావడంతో జనతా కలెక్షన్స్ మరింత జోరు అందుకుంటాయని సినీ పండితులు చెపుతున్నారు.
 
మరోవైపు మలయాళంలో బాహుబలి సినిమా రూ.3.25 కోట్లకి అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ అత్యధిక రేటు పలికిన తెలుగు సినిమా బాహుబలి మాత్రమే. ప్రస్తుతం ఈ రికార్డును కూడా ఎన్టీఆర్ గ్యారేజ్ బ్రేక్ చేసింది. ఈ సినిమాలో ఎక్కువ మలయాళ స్టార్స్ ఊండతో దానితో ఈ సినిమాకి మలయాళ రైట్స్ కోసం బంపర్ ప్రైజ్ పలికింది. 
 
ఈ సినిమాని క్యాష్ చేసుకోవడం కోసం ఓ ఫేమస్ కేరళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘జనత గ్యారేజ్’ రైట్స్‌ని తీసుకున్న సంగతి తెలిసిందే. సుమారు రూ.4.2 కోట్లకి జనత గ్యారేజ్ మలయాళ డబ్బింగ్ వెర్షన్ రైట్స్ తీసుకున్న సంగతి విదితమే.