శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (10:30 IST)

జాన్వీ కపూర్ పుట్టిన రోజు... ఎన్టీఆర్- మహేష్ బాబుతో రొమాన్స్

Jhanvi kapoor
Jhanvi kapoor
జాన్వీ కపూర్ పుట్టిన రోజు నేడు. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలో దక్షిణాది సినిమాల్లోనూ కనిపించనుంది. ఇందులో భాగంగా.. జూనియర్ ఎన్టీఆర్‌తో తదుపరి సినిమాలో ఈమె కనిపించనుందని టాక్ వస్తోంది. 
 
జాన్వీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె గురించి కాస్త తెలుసుకుందాం.. శ్రీదేవి మార్చి 7, 1997న ముంబైలో జన్మించింది. బోనీ కపూర్- శ్రీదేవిల బంధానికి అపురూపమైన రూపం జాన్వీ కపూర్. జాన్వీ ముంబైలోని "ధీరూభాయ్ అంబానీ స్కూల్"లో తన ప్రారంభ పాఠశాల విద్యను ముగించింది. ఆమె లాస్ ఏంజిల్స్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకోవడానికి అమెరికా వెళ్లింది. శ్రీదేవి మరణానంతరం బాలీవుడ్ సినిమాలో కనిపించింది. దఢక్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. 
 
జాన్వీ కపూర్‌కి 2023 నాటికి 26 ఏళ్లు నిండుతాయి. ఆమె తన ఫిగర్‌ని ఉంచుకోవడానికి ప్రతిరోజూ జిమ్‌లో వర్క్‌అవుట్ చేస్తుంది. పక్కా డైట్ ఫాలో అవుతోంది. అందంగా కనిపిస్తుంది. 
 
బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో జాన్వీ కపూర్ ఒకరు. ఆమె అద్భుతమైన ప్రదర్శన కారణంగా నటన, ఎండార్స్‌మెంట్‌లు, మోడలింగ్, ఇతర ప్రాజెక్ట్‌ల నుండి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించింది.
 
నటిగా, జాన్వీ కపూర్ ప్రతి సినిమాకు దాదాపు ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఆమె వృత్తిపరమైన నటిగా, గాయనిగా, ఎండార్సర్‌గా, మోడల్‌గా అనేక ఇతర వనరుల ద్వారా డబ్బు సంపాదిస్తుంది.
 
జాన్వీ మంచి నటిగా ఎదగాలనే ఆకాంక్ష ఆమె తల్లి అయిన శ్రీదేవికి వుండేది. జాన్వీకి దక్షిణాది సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మహేష్ బాబుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. జాన్వీ కపూర్‌కు డ్యాన్స్, టెన్నిస్‌ అంటే ఇష్టం. ఇంకా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ యాక్టివ్‌గా వుంటుంది. 
 
జాన్వీ కపూర్ ఎత్తు- 163 సెం.మీ (5 అడుగుల 4 అంగుళాలు
జాన్వీ శారీరక కొలతలు 32-26-32, ఆమె బరువు 50 కిలోలు
ఇష్టమైన నటుడు: సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, దిలీప్ కుమార్
ఇష్టమైన నటి: నూతన్, వహీదా రెహమాన్, కరీనా కపూర్, మధుబాల
అభిరుచులు: ప్రయాణం, సంగీతం వినడం.
ఇష్టమైన ప్రాంతం: మారిషస్, మాల్దీవులు,
ఇష్టమైన ఆహారం: ఇటాలియన్ వంటకాలు, రాజస్థానీ వంటకాలు, మటన్
ఇష్టమైన చిత్రం: హమ్ దిల్ దే చుకే సనమ్, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే
ఇష్టమైన రంగు: ఆరెంజ్
ఇష్టమైన క్రీడలు: క్రికెట్
ఇష్టమైన డిజైనర్: మనీష్ మల్హోత్రా