బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (09:08 IST)

రూ.39 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన జాన్వీ కపూర్

బాలీవుడ్‌ కథా నాయిక జాన్వీ కపూర్‌ తాజాగా రూ.39 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసారు. విలాసవంతమైన రెసిడెన్షియల్‌‌లో క్వాలిటీగా పేరొందిన జుహూ విలే పార్లే స్కీం పక్కనే జాన్వీ కపూర్‌ కొనుగోలు చేసిన ఆస్తి ఉంది. ఇది బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం నివాసం పక్కనే.
 
అమితాబ్‌ బచ్చన్‌తోపాటు అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవ్‌గన్‌, ఏక్తా కపూర్‌ తదితర సెలబ్రిటీల సొంత భవనాల పక్కనే జాన్వీ కొనుగోలు చేసిన ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ తన కుటుంబంతో కలిసి లోఖండ్‌వాలాలో నివాసం ఉంటున్నారు.
 
2020 డిసెంబర్‌ 10వ తేదీన జాన్వీ కపూర్‌ ఈ ఆస్తిని రిజిస్టర్‌ చేయించుకున్నట్లు సమాచారం. సదరు బిల్డింగ్‌లోని 14,15, 16 అంతస్తుల్లో 4,144 చదరపు అడుగుల ప్లాట్లు ఆమె కొనుగోలు చేశారు. 
 
కాగా, 2018లో ఇషాన్‌ ఖట్టర్‌తో కలిసి 'ధడక్‌' చిత్రంతో జాన్వీ కపూర్‌ సినీ రంగంలోకి ప్రవేశించారు. మరాఠీలో సైరాత్‌ పేరుతో నిర్మించిన సినిమాకు 'ధడక్‌' రీమేక్‌. సైరాత్‌ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది.