సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (12:30 IST)

మధురానగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో జాన్వీ కపూర్ (video)

Jhanvi Kapoor
Jhanvi Kapoor
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా, హైదరాబాద్ మధురానగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. అరగంటపాటు ఆలయంలో పూజలు నిర్వహించిన జాన్వీకి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. 
 
ఇక మధురానగర్‌కు జాన్వీకపూర్ వచ్చిన విషయం తెలిసిన అభిమానులు, స్థానికులు ఆమెను చూసేందుకు ఆలయానికి చేరుకున్నారు. ఆమెతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
 
ఇకపోతే.. జాన్వీ కపూర్ గతంలో చాలా సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మధ్య ఆమె తెలుగులో నటించిన దేవర మూవీ భారీ విజయం సాధించింది.
 
భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో ఆమె నటన అందరిని మెప్పించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన జాన్వీ నటిస్తోంది.