బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (20:12 IST)

జపాన్ అభిమానానికి ఫిదా అయిపోయిన చెర్రీ

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు తన పుట్టినరోజున జ‌పాన్ అభిమానుల నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా జపాన్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. కాగా మార్చి 27న రామ్‌చ‌ర‌ణ్ పుట్టినరోజు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ జ‌పాన్ నుంచి కొంద‌రు అభిమానులు బ‌ర్త్‌డే గిఫ్ట్స్ పంపించారు. రామ్ చరణ్ న‌టించిన మ‌గ‌ధీర‌ చిత్రంలోని పాత్ర‌లను గ్రీటింగ్ కార్డుల‌పై చిత్రించి పంపించారు. దాదాపు 50 మంది ఇలా చెర్రీపై ప్రేమ‌ను చాటుకున్నారు.
 
చెర్రీ కూడా వారి అభిమానానికి ప్రతిగా ఆ గ్రీటింగ్ కార్డుల‌ను త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. త్వ‌ర‌లోనే జపాన్ వచ్చి వారిని క‌లుస్తాన‌ని కూడా హామీ ఇచ్చాడు. `జ‌పాన్ నుంచి స్వీట్ స‌ర్‌ప్రైజ్ అందింది. నా ప‌ట్ల మీకున్న ప్రేమానురాగాలు న‌న్నెంతో సంతోష‌ప‌రిచాయి. త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని కలుస్తాన‌ని ఆశిస్తున్నా. థాంక్యూ జ‌పాన్` అని చరణ్ పోస్ట్ చేశాడు.