శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (11:21 IST)

సినిమా ఓ వ్యాపారంగా మారిపోయింది.. సినిమా వాళ్లు బరితెగించారు: జయాబచ్చన్

ఇప్పటి సినిమా పచ్చి బిజినెస్‌గా మారిందని, ఒక్క మాటలో చెప్పాలంటే సినిమావాళ్లు బరితెగించారని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ఫిలిం మేకర్లు గతంలో కళా

ఇప్పటి సినిమా పచ్చి బిజినెస్‌గా మారిందని, ఒక్క మాటలో చెప్పాలంటే సినిమావాళ్లు బరితెగించారని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ఫిలిం మేకర్లు గతంలో కళాఖండాలను రూపొందించేవారని... కానీ, ఇప్పటి ఫిలిం మేకర్లకు అది పట్టడం లేదని, కేవలం నంబర్లు, బిజినెస్ మాత్రమే చూసుకుంటున్నారన్నారు. 
 
తొలి వారం రికార్డులు, రూ.100 కోట్ల కలెక్షన్లు... ఇప్పుడంతా వీటినే చూస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ తనకు అర్థం కావని, అందుకే ఇలాంటి చోట తాను ఇమడలేక పోతున్నానని చెప్పారు. తెరనిండా పాశ్చాత్య పోకడలు కనిపిస్తున్నాయని, పొట్టి పొట్టి దుస్తులే తప్ప భారతీయత ఎక్కడుందని ప్రశ్నించారు. 
 
50, 60 దశకాల్లో సినిమాల్లో జీవం ఉట్టి పడేదని చెప్పారు. ఆ రోజుల్లో సినిమాల్లో ఒక హీరోయిన్, ఒక వాంప్ ఉండేవారని... ఇప్పుడు వాంప్ ల అవసరం లేదని, హీరోయిన్లే వాంప్‌లు చేయాల్సినవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. అలీగఢ్, మసాన్ లాంటి సినిమాలు నిజమైన భారతీయ సినిమాలని... అలాంటి సినిమాలను భారతీయులు ఆదరిస్తారని తెలిపారు.