శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 జులై 2016 (17:12 IST)

రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ అనుకృతిని జేడీ చక్రవర్తి పెళ్లాడనున్నాడా?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుడు జేడీ చక్రవర్తి త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. నాలుగు పదుల వయస్సులో జేడీ చక్రవర్తి పెళ్లి చేసుకోనున్నాడు. ఆర్జీవీ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ నాగార్జునతో తీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుడు జేడీ చక్రవర్తి త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. నాలుగు పదుల వయస్సులో జేడీ చక్రవర్తి పెళ్లి చేసుకోనున్నాడు. ఆర్జీవీ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ నాగార్జునతో తీసిన శివ చిత్రంలో జేడీ అనే పాత్ర ద్వారా చక్రవర్తి సినిమా ఆరంగేట్రం చేశాడు. తొలి సినిమాతోనే చక్రవర్తి టాలీవుడ్‌లో మంచి స్థానాన్ని దక్కించుకున్నారు. 
 
గతంలో అతను చాలామంది హీరోయిన్స్ టో డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు వినిపించినా కూడా ఆ వార్తలు ఏవి నిజం కాలేదు. తాజాగా 46 ఏళ్ల వయస్సులో జేడీ వివాహం చేసుకోనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు జోరందురున్నాయి. జేడీ అమ్మగారు బలవంతంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 
 
జేడీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి కూడా ఆర్జీవీ హీరోయిన్ అని తెలిసింది. శ్రీదేవి సినిమాలో నటించిన అనుకృతిని జేడీ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇకపోతే.. తాను పెళ్ళి చేసుకునే అమ్మాయిని గురించిన వివరాలతో పాటు ఎప్పుడు మ్యారేజ్ అనే విషయాలను జేడీ త్వరలో ప్రకటించనున్నారని తెలిసింది.