మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:22 IST)

చదువంటే పత్రంపై మార్కులు కాదు : స్టూడెంట్స్ సూసైడ్స్‌పై నాని ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించిన పరీక్షా ఫలితాల్లో లక్షలాది మంది ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా, అనేక మంది టాపర్స్ కూడా బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం కూడా మరో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్ పరీక్షల మూల్యాంకనలో జరిగిన పొరపాట్ల వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోవడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. దీనిపై పలువురు సెలెబ్రిటీలు ఇప్పటికే స్పందించారు. 
 
తాజాగా 'జర్సీ' హీరో నాని కూడా ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు. "చ‌దువు అంటే మార్కుల ప‌త్రాల‌పై నెంబ‌ర్లు కాదు. నేర్చుకోవ‌టం మాత్ర‌మే. నువ్వు అర్హ‌త సాధించని ప్ర‌తీ సారి తిరిగి పోరాటం చేయి. అస్స‌లు వ‌దలొద్దు. వీటన్నింటికంటే జీవితం చాలా ముఖ్య‌మైన‌ది. మీ త‌ల్లిదండ్రుల గురించి, మిమ్మ‌ల్ని ప్రేమించే వారి గురించి ఒక్క‌సారి ఆలోచించండి. వారు ప్రేమించేది మీ ఇంట‌ర్మీడియెట్ రిజ‌ల్ట్స్‌ని కాదు.. కేవ‌లం మిమ్మ‌ల్ని చూసి" అంటూ నాని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
అయితే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని , ఇప్పటికే రీ వెరిఫికేషన్, కౌంటింగ్‌కు దరఖాస్తు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లించనున్నట్లు బోర్డు వెల్లడించింది.