గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2024 (13:57 IST)

జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని వుంది... కీర్తి సురేష్

Keerthy Suresh
Keerthy Suresh
ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న బెస్ట్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. మహానటితో, ఆమె స్టార్‌డమ్‌ని సాధించింది. ఆపై దసరా చిత్రంలో తన నటనకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితం, కెరీర్‌పై చాలా ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. 
 
కీర్తి జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టడానికి సిద్ధంగా వున్నట్లు తెలిపింది. "మహానటి ఆడియో లాంచ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌గారిని మొదటిసారి చూశాను. మేమిద్దరం కలిసి ఒక సినిమాకు పని చేయాలి అనుకున్నాను. మహానటి విడుదల రోజున ఎన్టీఆర్ సార్ తన నివాసంలో టీమ్‌కి సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన సరదాగా, ఎనర్జిటిక్ గా ఉండేవారు" అని కీర్తి వెల్లడించింది.
 
ప్రస్తుతం రెండు భాగాలుగా విడుదల కానున్న "దేవర" ప్రాజెక్టుపై ఎన్టీఆర్ పనిచేస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక వర్క్ ఫ్రంట్‌లో, కీర్తి సురేష్ తర్వాత రివాల్వర్ రీటా, రఘు తథా, కన్నివెడి, బేబీ జాన్‌లలో కనిపించనుంది. ప్రస్తుతానికి, ఆమె చేతిలో తెలుగు సినిమా ఏదీ లేదు.