ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ టీజర్ అదుర్స్.. 1 మిలియన్ లైక్స్, లక్ష కామెంట్లు

komaram bheem
komaram bheem
సెల్వి| Last Updated: శనివారం, 14 నవంబరు 2020 (15:32 IST)
టాలీవుడ్‌లో మొదటి ఒక మిలియన్ లైక్స్ సాధించిన టీజర్‌గా.. లక్ష కామెంట్లు పొందిన మొదటి టీజర్‌గా ట్రిపుల్ ఆర్ కొమరం భీమ్ టీజర్ నిలిచింది. ఇక వేగంగా 30 మిలియన్ల వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్‌గా రికార్డు సృష్టించింది. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తెగ పండుగ చేసుకుంటున్నారు.

బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం సినీ ప్రేమికులంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి జక్కన సినిమా తెరకెక్కించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా, కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి భీమ్ ఫర్ రామరాజు , రామరాజు ఫర్ భీమ్ పేర్లతో రెండు టీజర్లను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ రెండు టీజర్లు సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఎన్టీఆర్ టీజర్ తాజాగా మరో రికార్డు‌ను తిరగరాసింది.దీనిపై మరింత చదవండి :