శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (14:18 IST)

తారక్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్: స్టూడెంట్‌ లీడర్ రోల్‌లో..?

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్‌కు సిద్ధమైన నేపథ్యంలో తారక్ తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. తారక్ కొత్త త్వరలోనే ప్రారంభం కానుంది. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. ఫిబ్రవరి 7న ఈ మూవీ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
 
ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్‌ సంస్థ నిర్మించే ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో హీరోయిన్‌గా అలియాభట్ నటించనుంది. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఇందులో స్టూడెంట్‌గా నటించనున్నాడట ఎన్టీఆర్.
 
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'జనతా గ్యారేజ్'లోనూ ఎన్టీఆర్ కాసేపు స్టూడెంట్‌గా కనిపించిన విషయం తెలిసిందే.