గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (17:27 IST)

కొడాలి నాని కాలిపై కాలేసి కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌- ఫోటో వైరల్

Junior NTR
Junior NTR
టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీతో వార్తల్లో నిలిచిన జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా వైసీపీ కీల‌క నేత‌, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో గతంలో తీసుకున్న ఫోటో ద్వారా మళ్లీ ట్రెండింగ్‌లో నిలిచారు.

ఆ ఫోటోలో 2014, 2019 ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్ర‌స్తుతం వైసీపీకి స‌న్నిహితంగా మెల‌గుతున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ కూడా ఉన్నారు. కొడాలి నాని మ‌ధ్య‌లో కూర్చుని ఉండ‌గా... ఆయ‌న‌కు ఎడ‌మ వైపున కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌... త‌న కాలిని కొడాలి నాని కాలిపై వేసి మ‌రీ కూర్చున్నారు. అదేమీ ప‌ట్టించుకోకుండా కొడాలి నాని ఏదో నోట్స్‌ రాస్తుండిపోయారు. ఇక ఈ స‌న్నివేశాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వంశీ చిరున‌వ్వులు చిందిస్తున్నారు.

నాని, వంశీ ఇద్ద‌రూ టీడీపీతోనే రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన వారేనన్న సంగతి తెలిసిందే. వీరితో జూనియ‌ర్ ఎన్టీఆర్ చాలా స‌న్నిహితంగా మెల‌గేవారు. ఈ క్ర‌మంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో రెండు, మూడు సినిమాల‌కు వంశీ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హరించారు. కొడాలి నాని కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.