Widgets Magazine Widgets Magazine

వీఐపీ రీమేక్ ఆర్టిస్ట్ పద్మావతి సెట్లోనే మృతి.. భవనం వద్ద దొరికిన మృతదేహం.. ఏమైంది?

మంగళవారం, 10 జనవరి 2017 (17:28 IST)

Widgets Magazine

ధనుష్‌ తమిళ చిత్రం 'వీఐపీ'కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న కన్నడ జూనియర్ ఆర్టిస్ట్ పద్మావతి (44) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈమె అనుమానాస్పదస్థితిలో సెట్స్‌లోనే ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. యలహంక సమీపంలోని ఓ భవనంలో సోమవారం సాయంత్రం షూటింగ్‌ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
దాదాపు 120 మంది బృందంతో వీఐపీ సినిమాను కన్నడ రీమేక్ షూటింగ్‌ యలహంకలో జరుగుతుండగా... సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ప్యాకప్ సమయంలో పద్మావతి సెట్లో లేదని యూనిట్ గుర్తించింది. వెంటనే ఆమెకోసం వెతకడంతో నిర్మాణంలో ఉన్న మరో భవనం వద్ద ఆమె మృతదేహం దొరికింది. ఆమె మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం యలహంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
పద్మావతి కనిపించలేదని రాత్రి 9 గంటలకు తమకు సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దర్శకుడిని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ఇంకా పద్మావతి మృతి పట్ల అనుమానాలున్నాయని స్నేహితులు అంటున్నారు. అయితే నిర్మితమవుతున్న భవనం ఎనిమిదో అంతస్తు నుంచి ఆమె కిందపడిపోయి మరణించినట్లు యూనిట్ చర్చించుకుంటోంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు సినిమా

news

'ఘాజీ' చిత్రం ట్రైలర్‌‌కు వేళాయె... ఇది యుద్ధం.. దాని గురించి మీకు తెలియదు

బాహుబలి ది ఎండింగ్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో బాహుబలి భల్లాలదేవ రానా ఘాజీ సినిమాపై ...

news

'ఖైదీ నంబర్ 150' సంచలనాలు.. హైదరాబాద్ ఐమ్యాక్స్‌ బ్లాకైపోయింది... ఎందుకో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" విడుదలకు ముందే సంచనాలు నమోదు చేస్తోంది. ...

news

బాబాయ్‌ పవన్‌కి చెర్రీ ధన్యవాదాలు: ఎన్టీఆర్, మహేష్‌లకు చెర్రీ చాలా క్లోజ్.. అఖిల్ ఐతే?: చిరు

ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో ఈవెంట్‌కు మెగాహీరోలందరూ ...

news

చిరంజీవితో వైకాపా ఎమ్మెల్యే రోజా ఇంటర్వ్యూ... జగన్ పార్టీ లోకి జంపేనా...?

రాజకీయాల్లో వారిద్దరు ప్రత్యర్థులు. రాజకీయాల్లో ఉన్నంతవరకు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి ...