శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (09:06 IST)

ఆర్థిక కష్టాలతో జూనియర్‌ ఆర్టిస్టు ఆత్మహత్యాయత్నం.. హీరో విశాల్‌పై ఆరోపణలు

చెన్నైలో ఓ జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనను నడిగర్‌ సంఘం ఆదుకోలేదన్న ఆవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్‌

చెన్నైలో ఓ జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనను నడిగర్‌ సంఘం ఆదుకోలేదన్న ఆవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఆ జూనియర్ ఆర్టిస్టు పేరు సెల్వరాజ్‌. ఈ ఆత్మహత్యాయత్నం కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... స్థానిక వ్యాసర్‌పాడి ఎంకేబీ నగర్‌కు చెందిన జూనియర్‌ ఆర్టిస్టు సెల్వరాజ్‌ నడిగర్‌ సంఘం సభ్యుడిగా ఉన్నారు. సుమారు 40 సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన ఆయనకు పారితోషికం సక్రమంగా అందకపోవడంతో ఆర్థిక కుటుంబభారం కష్టమైంది. దీనికితోడు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. 
 
మరోవైపు సెల్వరాజ్‌, ఆయన భార్య శశికళతో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ దంపతులు విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి సెల్వరాజ్‌ ఆత్మహత్యకు యత్నించారు. అతని నోటి నుంచి నురగ రావడం గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలందించిన వైద్యులు సెల్వరాజ్‌ ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపారు. 
 
కాగా, నడిగర్‌ సంఘం నిర్వాహకుల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విశాల్‌ మంటగలిపారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాటి కళాకారులను ఆదుకుంటామని హామీ ఇవ్వబట్టే తాము విశాల్‌ టీమ్‌ను గెలిపించామన్నారు. సెల్వరాజ్‌లాగే వందలాది మంది జూనియర్‌ ఆర్టిస్టులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఇప్పటికైనా నడిగర్‌ సంఘం స్పందించాలని పలువురు జూనియర్ ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు.