శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (11:35 IST)

సూపర్ గర్ల్ మూవీ ఇంద్రాణిలో సూపర్ విలన్ ఎలక్ట్రో మ్యాన్‌గా కబీర్ దుహన్ సింగ్

Indrani, poster
Indrani, poster
భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టి సూప‌ర్‌గ‌ర్ల్ మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం `ఇంద్రాణి`. తెలుగు తెరపై ఇంత వ‌ర‌కూ చూడ‌ని ఒక‌ డిఫరెంట్ పాయింట్ తో విజువల్ వండర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు స్టీఫెన్. ఈ మూవీలో సూప‌ర్‌గ‌ర్ల్ పాత్ర‌కు ధీటైన సూప‌ర్ విల‌న్ గా ప్ర‌ముఖ న‌టుడిగా తెలుగు,త‌మిళ‌, హిందీ భాష‌ల‌లో సుప‌రిచితుడైన కబీర్ దుహన్ సింగ్‌ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో క‌బీర్ దుహాన్ సింగ్ ఎల‌క్ట్రో మ్యాన్‌గా క‌నిపించ‌నున్నారు. శ్రీ రామ న‌వమి సంద‌ర్భంగా ఎల‌క్ట్రోమ్యాన్‌గా క‌బీర్ దుహాన్ సింగ్ మోష‌న్‌పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. భారీ విజువ‌ల్స్ ఎఫెక్ట్స్‌తో ఉన్న ఈ మోష‌న్ పోస్ట‌ర్ కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ద‌ర్శకుడు స్టీపెన్ మాట్లాడుతూ - ``భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు కనిపించని అత్యంత శక్తివంతమైన సూపర్ విలన్‌గా ఇంద్రాని సినిమాలో కబీర్ దుహన్ సింగ్ క‌నిపించ‌నున్నారు. సూప‌ర్ ఉమెన్ ఇంద్రాని, ఎలక్ట్రోమ్యాన్ కబీర్ సింగ్ మ‌ధ్య వ‌చ్చే యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండి ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ కలిగిస్తాయి. భారీ బ‌డ్జెట్‌తో గ్రాండ్ వీఎఫ్ఎక్స్‌తో తెర‌కెక్కుతోన్న ఇంద్రాని త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌కు సూప‌ర్‌గుడ్ ఫీల్‌ను అందిస్తుంది`` అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ స్టాన్లీ సుమ‌న్ బాబు మాట్లాడుతూ - ``యూనిక్ స్టోరీలైన్‌తో రూపొందుతోన్న  ఇంద్రాణి షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఇంద్రాని టైటిల్, ఫ‌స్ట్‌లుక్ మోష‌న్‌ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన‌ రెస్పాన్స్ వ‌చ్చింది. చ‌ర‌ణ్ మాధ‌వ‌నేని విజువ‌ల్స్‌, సాయి కార్తిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్తాయి`` అన్నారు.
 
న‌టీన‌టులు: యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ సింగ్, ఫ్ర‌ణిత జిజిన‌, గ‌రీమా కౌశ‌ల్‌, ష‌త‌ఫ్ అహ్మ‌ద్‌