కాజల్ అగర్వాల్ కూడా #MeeToo అనేసింది... ఏం చెప్పిందో చూడండి...

Kajal
Last Modified శుక్రవారం, 12 అక్టోబరు 2018 (15:44 IST)
శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. ఆ తర్వాత వరుసగా తన పట్ల అభ్యంతరంగా ప్రవర్తించినవారి పేర్లను బయటపెడుతూ చెమటలు పట్టించింది. ఇక ఫేస్ బుక్ లైవ్ ఇస్తూ కొన్నిసార్లు బూతులు కూడా తిట్టేసింది. అంతకుముందు సుచిత్ర లీక్స్ అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపింది గాయని. ఇప్పుడు మళ్లీ మరో గాయని చిన్మయి కూడా తమిళ ఇండస్ట్రీలోని పలువురి పేర్లు చెపుతూ దడ పుట్టిస్తోంది.
 
ఇక అసలు విషయానికి వస్తే చిన్మయికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మద్దతు వస్తోంది. ఇప్పటికే సమంత తన మద్దతు తెలిపింది. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా #MeeToo అనేసింది. మహిళలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోరాడాల్సిన అవసరం వున్నదని అంటోంది. తమ బాధలను చెప్పుకునే మహిళలను అగౌరవపరచడం అసమంజసమనీ, తమకు ఎదురైన చేదు అనుభవాలను వెలుగులోకి తీసుకువచ్చి ధైర్యంగా ముందుకు సాగుతున్నవారికి తన మద్దతు వుందని చెపుతూ #MeeToo #MeeTooIndia #TimesUp అంటూ ట్యాగ్ చేసింది. దీనిపై మరింత చదవండి :