'ఎంత మంచివాడ‌వురా' సంక్రాంతికి వ‌స్తుందా లేదా?

Mehreen
శ్రీ| Last Modified శుక్రవారం, 8 నవంబరు 2019 (20:27 IST)
118 సినిమాతో డిఫరెంట్ హిట్ అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఎంత మంచివాడ‌వురా అనే సినిమా చేస్తున్నాడు. శతమానం భవతి సినిమాతో ట్రేడ్ మార్క్ హిట్ కొట్టిన దర్శకుడు సతీష్ వేగేశ్నఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.


సినిమా రిలీజ్ డేట్ పైన చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామాను జనవరి 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ అప్పుడపుడు రిలీజ్ చేస్తున్న పోస్టర్స్‌తో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు.

సంక్రాంతికి ఈ సినిమా తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంతో ఆ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నారు. ఇటీవల హీరోయిన్ నటశా దోషి - కళ్యాణ్ రామ్ మధ్య సాంగ్‌ని చిత్రీకరించిన చిత్ర యూనిట్ రాజమండ్రి - గోదావరి పరిసర ప్రాంతాల్లో కళ్యాణ్ రామ్ విలన్ల మధ్య ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసింది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌రి... సంక్రాంతికి వ‌స్తున్న క‌ళ్యాణ్ రామ్ ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.దీనిపై మరింత చదవండి :