శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (13:38 IST)

కళ్యాణ్‌రామ్‌ చేతికి ఉన్న ట్యాటులో ఉన్నది ఎవరంటే..?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ''ఇజం''. ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్‌గ

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ''ఇజం''. ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్‌గా కనిపించనున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందిస్తున్నారు.
 
పూరీ జగన్నాథ్ ఓ పాట రాయడంతో పాటు స్వయంగా పాడడం ఈ సినిమాకి హైలైట్ గా మారిందని యూనిట్ సభ్యులు అంటున్నారు. కాగా ఈ సినిమా ఆడియో వేడుక మొన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో జూనియర్‌ ఎన్టీఆర్‌, హరికృష్ణ ముఖ్య అధిథులుగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే కళ్యాణ్‌ రామ్‌ చేతికి ఒక ట్యాటు కనిపించింది. అసలు ఆ టాటూ ఏంటా అని ఆరా తీయగా… ''స్వాతి'' అని ఉంది.
 
 కళ్యాణ్‌రామ్‌ సతీమణి పేరు స్వాతి కావడంతో భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలా చూపిస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ పెద్దగా బయటికి రాని ఆమె…. పిల్లలు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే... గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, అలీ, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది.