గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (06:06 IST)

నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. నాతో పాటు పోరాటానికి సిద్ధం కండి: కమల్ పిలుపు

తమిళ సినీ నటుడు కమల్ హాసన్ తమిళ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. నాతో పాటు పోరాటానికి సిద్ధం కావాలంటూ ఆయన కోరారు. కోయంబత్తూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ

తమిళ సినీ నటుడు కమల్ హాసన్ తమిళ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. నాతో పాటు పోరాటానికి సిద్ధం కావాలంటూ ఆయన కోరారు. కోయంబత్తూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి శుభకరమైన రోజున ఓ మంచి మాట చెపుతున్నా... త్వరలోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. నాతో పాటు ప్రయాణం చేసేందుకు మీరూ సిద్ధంగా ఉండాలంటూ ఆయన తన అభిమానులతో పాటు.. ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
పనిలోపనిగా తమిళనాడు రాజకీయాలపై, రాజకీయనాయకులపై విమర్శలు గుప్పించారు. తమిళనాడు రాజకీయాల్లో అవినీతి పెరిగిందని, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, కోటను ముట్టడించేందుకు సిద్ధం కండి అంటూ కమల్ ప్రజలకు పిలుపు నిచ్చారు. 
 
‘మీ చేతులకు అవినీతి మరక అంటనీయకండి.. నాతో పాటు పోరాటానికి అందరూ సిద్ధం కండి’ అని కమల్ పేర్కొన్నారు. కాగా, ‘ప్రస్తుతం ఎవరూ రాజు కాదు. మనం విమర్శిద్దాం. మనం రాజులం కాము. ఓడినా, మరణించినా, నేను తీవ్రవాదినే. నేను తలచుకుంటే నేనే నాయకుడిని..’ అంటూ గతంలో కమల్ తన కవితలో పేర్కొనడం విదితమే.