గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 31 జులై 2017 (12:16 IST)

రేటింగ్ కోసం శృతిమించిన తమిళ బిగ్‌బాస్.. కమల్‌పై రూ.100 కోట్లకు దావా

తమిళ బిగ్‌బాస్ షోలో రేటింగ్ కోసం హౌస్‌మేట్స్‌తో పాటు యాంకర్ కమల్ హాసన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీంతో వారు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రధానంగా ఈ షోలో మురికివాడలు, గుడిసెల్లో నివసిస్తున్న

తమిళ బిగ్‌బాస్ షోలో రేటింగ్ కోసం హౌస్‌మేట్స్‌తో పాటు యాంకర్ కమల్ హాసన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీంతో వారు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రధానంగా ఈ షోలో మురికివాడలు, గుడిసెల్లో నివసిస్తున్న వారిని కించపరిచారనే ఆరోపణలు వచ్చాయి. 
 
దీంతో పుదియ తమిళగం పార్టీ అధినేత డాక్టర్ కృష్ణస్వామి కోర్టును ఆశ్రయించారు. ఈ షోలో మురికివాడలు, గుడిసెల్లో నివసిస్తున్న వారిని కించపరిచారని పేర్కొంటూ కమల్ హాసన్‌పై రూ.100 కోట్లకు దావా వేశారు. ఏడు రోజుల్లోగా కమల్, గాయత్రి, టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
 
ఈ షోలో పోటీదారుడిగా ఉన్న ఓ నటుడిపై గాయత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతని ప్రవర్తన మురికివాడల్లో నిసించేవారిలా ఉందని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తక్కువ కులాలు, పేదవారిని కించపరిచేలా ఉన్నాయని కృష్ణస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ దావా వేశారు. ఈ షోలో కుల సంబంధమైన ప్రవర్తనను కమల్ ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.