మంగళవారం, 19 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (12:14 IST)

''నేను ముఖ్యమంత్రి'' కమల్ వ్యాఖ్యలపై రాజకీయాల్లో రచ్చ రచ్చ.. సీఎం అవుతారా?

తమిళనాడు రాజకీయాల్లో సినీ లెజెండ్ కమల్ హాసన్ వ్యాఖ్యలు అలజడి రేపాయి. ''నేనే ముఖ్యమంత్రి'' అంటూ కమల్ హాసన్ పోస్టు చేసిన వరుస ట్వీట్లు వివాదానికి దారితీస్తున్నాయి. అయితే కమల్ ముఖ్యమంత్రి అనే పదాన్ని నేర

తమిళనాడు రాజకీయాల్లో సినీ లెజెండ్ కమల్ హాసన్ వ్యాఖ్యలు అలజడి రేపాయి. ''నేనే ముఖ్యమంత్రి'' అంటూ కమల్ హాసన్ పోస్టు చేసిన వరుస ట్వీట్లు వివాదానికి దారితీస్తున్నాయి. అయితే కమల్ ముఖ్యమంత్రి అనే పదాన్ని నేర్పుగా వినియోగించినట్లు తర్వాత తేలింది. 
 
తమిళంలో ముదళ్వర్‌ను సీఎం అనే అర్థంలో ఉపయోగిస్తారు. దీనికి నాయకుడు అనే అర్థం కూడా ఉంది. కమల్ హాసన్ 11 లైన్లమేర ఓ తమిళ పద్యాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. అందులో ప్రత్యేకించి తనను ఓడిస్తే తాను అంతకంటే బలంగా తిరగబడతానన్నారు. తలుచుకుంటే తానే ముఖ్యమంత్రి అనేపదాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. 
 
ఇంకా ఆంగ్లపత్రికలు దీనిపై ఓ ప్రత్యేక సందేశాన్ని ప్రచురిస్తాయని కూడా రాశారు. అంతే ఒక్కసారిగా కమల్ రాజకీయ ప్రవేశంపై వార్తలు గుప్పుమన్నాయి. తాను ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో తమిళ తలైవాస్ జట్టుకి అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రకటించేందుకే కమల్ హాసన్ నేర్పుగా ట్విట్టర్‌ను ఉపయోగించుకున్నట్లు వెల్లడైంది. 
 
ఇటీవలే అన్నాడీఎంకే సర్కారులోని అన్ని శాఖల్లోనూ అవినీతి జరుగుతుందని వ్యాఖ్యానించడంతో అక్కడి మంత్రులంతా కమల్‌పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్’ షోపైనా విమర్శలు గుప్పించారు.