శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (17:15 IST)

బెదిరింపులకు పాల్పడితే కర్ణిసేన కార్యకర్తలను నాశనం చేస్తా : కంగనా హెచ్చరిక

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హెచ్చరించారు. తనకు బెదిరించాలని ప్రయత్నిస్తే కర్ణిసేన కార్యకర్తలను నాశనం చేస్తానని ఆమె హెచ్చరించారు. కంగనా రనౌత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "మణికర్ణిక". ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది. 
 
అయితే, ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయిని తప్పుగా చూపించారంటూ హిందూ కర్ణిసేన ఆరోపిస్తోంది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మీభాయ్‌ని అగౌరపరిచేలా ఏ ఒక్క సన్నివేశం ఉన్నాకూడా కంగనా రనౌత్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కర్ణిసేన హెచ్చరించింది. 
 
దీనిపై కంగనా స్పందించింది. 'నేను రాజ్‌పుత్‌నే. ఎవ‌రికి భ‌య‌ప‌డేది లేదు. బెదిరింపుల‌కి పాల్ప‌డితే క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌ల‌ని నాశనం చేస్తాను' అని హెచ్చరించింది. సినిమాలో ల‌క్ష్మీభాయ్ గురించి త‌ప్పుగా చూపించ‌లేదు. ఆమె నా బంధువు కాదు. భార‌త‌దేశ ముద్దుబిడ్డ‌. అలాంట‌ప్పుడు ఆమె గురించి త‌ప్పుగా ఎలా చూపిస్తామ‌ని కంగనా అంటుంది. మ‌రోవైపు క‌ర్ణిసేన బెదిరింపుల‌తో కంగ‌నా ఇంటి ద‌గ్గ‌ర భారీ భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు పోలీసులు.