సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి ఆ ఆరుగురికి లింకుంది.. కంగనా రనౌత్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యపై హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్‌ని మానసికంగా వేధించిన వారిలో వీరి పేర్లను అసలు మర్చిపోవద్దు అంటూ, ఒక ఆరుగురు పేర్లను తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది కంగనా రనౌత్.
సుశాంత్ సింగ్‌ని మానసికంగా వేధించిన వారిలో వీరి పేర్లను అసలు మర్చిపోవద్దు అంటూ, ఒక ఆరుగురు పేర్లను తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది కంగనా రనౌత్. ఏక్తా కపూర్, దీపికా పదుకొనే, కరణ్ జోహార్, అలియా భట్, మహేష్ భట్, రియా చక్రవర్తి పేర్లను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం ప్రస్తుతం సీబీఐకి అప్పగించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం సీబీఐ ఎవరినీ దోషులుగా తేలుతుంది.
గతనెల 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అతడు శవమై కనిపించినప్పటి నుంచి ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూనే ఉంది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ముంబై పోలీసులు నిర్ధారించగా.. కాదు హత్యే అంటూ సుశాంత్ తండ్రి ఆరోపించారు. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి.
సుశాంత్‌కు చెందిన రూ.15 కోట్లు రియా తీసుకుందని ఆయన తండ్రి పేర్కొన్నారు. అయితే, వీటిని రియా తోసిపుచ్చింది. కొన్నేళ్లుగా సుశాంత్ లో స్నేహం ఉందని, 2019 డిసెంబర్ నుంచి డేటింగ్ చేస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయానని, తాను సుశాంత్ నుంచి ఎలాంటి డబ్బులూ తీసుకోలేదని స్పష్టం చేసింది.