గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 నవంబరు 2021 (18:46 IST)

పర్యావరణ ప్రేమికులకు కంగనా క్లాస్.. 3 రోజులు కారు వాడొద్దు..

ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగ రోజున టపాకాయలు కాల్చొద్దంటూ నినాదాలు చేస్తున్న పర్యావరణ ప్రేమికులకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ క్లాస్ పీకింది. ఇలాంటి పర్యావరణ ప్రేమికులు, కార్యకర్తలు మూడు రోజుల పాటు కార్లను ఉపయోగించవద్దని కోరారు. 
 
దీపావళికి ముందు బాణాసంచా నిషేధంపై చర్చ జరగడం, దీనిపై నటి కంగనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా సద్గురు తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకునే వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 
 
దీపావళి కోసం పటాకులు కాల్చి, తర్వాత కోసం కొన్ని క్రాకర్లను ఎలా భద్రపరుచుకుంటానని ఆయన అన్నారు. మూడు రోజుల పాటు కారు వాడొద్దని పర్యావరణ కార్యకర్తలు కార్యాలయానికి వెళ్లాలని ఆమె కోరారు. 
 
ఇదిలావుంటే, దేశ రాజధాని ఢిల్లీలో గురువారం వాయుకాలుష్యం పెరిగింది. గాలి నాణ్యత సూచీ పేలవంగా ఉన్నది. దీపావళి పండుగ నేపథ్యం సూచీ మరింత దిగజారే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 
 
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సీబీసీబీ) నివేదిక  ప్రకారం, ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 352 నమోదైంది. అలాగే చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల వరకు గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది.