గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (09:51 IST)

కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం : హాస్య నటుడు సత్యజిత్ కన్నుమూత

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం జరిగింది. ప్రముఖ హాస్య నటుడు సత్యజిత్ మృతి చెందారు. ఆయన వయసు 72 యేళ్లు. ఈయన ఆదివారం తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. 
 
ఇటీవల కాలికి గాయమై గ్యాంగ్రిన్‌తో చికిత్స పొందుతుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందించారు. చికిత్స పొందుతూనే స‌త్య‌జిత్ క‌న్నుమూసారు. ఈయన కన్నడంలో 600కు పైగా చిత్రాల్లో నటించారు. 
 
ఆయన అసలు పేరు సయ్యద్‌ నిజాముద్దీన్‌ సత్యజిత్‌. 10వ తరగతి వరకు చదివిన ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. 1986లో 'అరుణరాగ' సినిమా ద్వారా కన్నడ చిత్రరంగంలో అడుగుపెట్టారు. విలన్‌ పాత్రల్లోనూ ప్రేక్షకుల్ని మెప్పించారు. సత్యజిత్ హ‌ఠాన్మ‌ర‌ణంపై ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.