శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

కుర్రపిల్లపై కన్నేసిన మాస్ మహారాజా

టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్లలో ఒకరు నభా నటేశ్. సుధీర్ బాబు హీరోగా నటించి తెరకెక్కించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతంచేసుకుంది. ఇందులో హీరోయిన్‍‌గా నభా నటేశ్ నటించ

టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్లలో ఒకరు నభా నటేశ్. సుధీర్ బాబు హీరోగా నటించి తెరకెక్కించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతంచేసుకుంది. ఇందులో హీరోయిన్‍‌గా నభా నటేశ్ నటించి మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఈమెకు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి.
 
నిజానికి రవిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'అదుగో' ఆమె తొలి సినిమా అయినప్పటికీ రిలీజ్ పరంగా 'నన్ను దోచుకుందువటే' తొలి సినిమాగా చెప్పుకోవాలి. కర్ణాటక నుంచి దిగుమతి అయిన నభా ఈ సినిమాలో గ్లామర్‌తో, నటనతో అందర్నీ ఆకట్టుకుంటోంది. 
 
ఇపుడు ఈ కన్నడ భామపై మాస్ మహారాజా రవితేజ కన్నేశాడు. ఫలితంగా తన తదుపరి చిత్రంలో ఆమెను బుక్ చేసుకున్నాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నభా హీరోయిన్‌గా ఖరారు చేయగా, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నవంబర్‌లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. రవితేజతో 'నేలటిక్కెట్టు' చిత్రాన్ని నిర్మించిన రామ్ తాళ్ళూరి ఈ సినిమాకు నిర్మాత.