శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2023 (15:49 IST)

ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో న్యూజిలాండ్ లో కన్నప్ప షూట్ ముగించాం

Mohan babu- newzland
Mohan babu- newzland
న్యూజిలాండ్  లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్, న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో  అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం అని మంచు మోహన్ బాబు ప్రకటనలోతెలియజేశారు.
 
 విష్ణు మంచు సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నారు. ఇంకా, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి వారు నటిస్తున్న ఈ కన్నప్ప మూవీ  దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, కన్నప్ప సినిమా నటీనలులకు, సాంకేతిక సిబ్బందికి మైలురాయిలా వుంటుందని పేర్కొంటూ, శివుని ఆశీస్సులతో ఈ సినిమా చేయగలిగానని తెలిపారు.