శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (13:56 IST)

వెండితెరపై మరో బయోపిక్ : దృశ్యకావ్యంగా కాంతారావు జీవిత చరిత్ర

తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "మహానటి" చిత్రం సూపర్ డూపర్‌ హిట్ అయింది. దీంతో స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోంది. అలాగే, వైఎస్ఆర్, నారా చంద్రబాబు నాయుడుల జీవిత చరిత్ర ఆధారంగా కూడా చిత్రాలు రానున్నాయి. 
 
ఇపుడు జానపద చిత్రాల రారాజు కాంతారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. జానపదాల్లో సహజంగానే కత్తి యుద్ధాలు ఉంటాయి.. ఆ కత్తి యుద్ధాల్లో ఆరితేరిన కథానాయకుడిగా ఆయన మంచి మార్కులు కొట్టేశారు. దీంతో ఆయన్ను ప్రతి ఒక్కరూ కత్తి కాంతారావు అని పిలుస్తుంటారు. 
 
అలాంటి కాంతారావు జీవితచరిత్రను దర్శకుడు పీసీ ఆదిత్య రూపొందిస్తున్నాడు. కాంతారావు జీవితంలోని వివిధ కోణాలను తెరపై ఆవిష్కరించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. 'రాకుమారుడు' అనే టైటిల్‌ను ఖరారు చేసిన ఆయన, పాటల రికార్డింగ్‌ను పూర్తి పూర్తి చేసినట్టు సమాచారం. 
 
త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాంతారావు పాత్రకుగాను అఖిల్ సన్నీ అనే యువకుడిని ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, రాజనాల, దర్శకుడు విఠలాచార్య, కృష్ణకుమారి, రాజశ్రీ తదితర పాత్రలకిగాను నటీనటుల ఎంపిక జరగాల్సివుంది. ఇదిలావుంటే, ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను గత జూన్ నెలలోనే దర్శకుడు పీసీ ఆదిత్య రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.