సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (16:56 IST)

తెలుగులోనూ కాంతార హిట్.. 10 కోట్లకి పైగా గ్రాస్

Kantara
Kantara
కన్నడలో హిట్ అయిన కాంతార సినిమా గురించే ప్రస్తుతం సినీ జనం మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 15వ తేదీన తెలుగులో విడుదలైన ఈ సినిమా, తొలి రెండు రోజుల్లోనే 10 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. 
 
దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా వసూళ్లు మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా రిషబ్ శెట్టిని ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టింది.
 
'కాంతార'. అడవిని ఆధారంగా చేసుకుని జీవించే ఒక గిరిజన గూడెం .. అక్కడి ఆచారంతో ముడిపడిన ఒక విశ్వాసం .. అక్కడే పుట్టిన ఒక ప్రేమకథ .. అడవి బిడ్డలపై కన్నెర్రజేసిన పెద్దరికంపై దైవశక్తి చూపించే ఆగ్రహమే ఈ కథ. ప్రస్తుతం ఈ స్టోరీ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.