ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (18:16 IST)

కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీకి మరో కొత్త వ్యక్తి..!

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్ సైఫ్ అలీఖాన్‌, కరీనా కపూర్ గుడ్ న్యూస్ చెప్పారు. తాము రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు బుధవారం ప్రకటించారు. తమ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం చాలా సంతోషిస్తున్నామని చెప్పారు, మీ ప్రేమను ఎల్లప్పుడూ అందించే శ్రేయోభిలాషులకు ధన్యావాదాలు... అంటూ సైఫ్‌, కరీనా అని ప్రకటనలో వెల్లడించారు. 2012లో వివాహబంధంతో వీరు ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ జంటకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆ బుల్లి హీరో పేరు తైమూర్‌ అలీఖాన్(3). ప్రస్తుతం కరీనా రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. 
 
కాగా.. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఓంకార, తాషన్, ఏజెంట్ వినోద్, కుర్బాన్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. 2012 సంవత్సరంలో వివాహం చేసుకున్న ఈ జంటకు 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించాడు. ఈ నేపథ్యంలో రెండో బిడ్డకు కరీనా తల్లికాబోతోందన్న వార్తను పంచుకున్న కొద్ది నిమిషాల్లోనే, సైఫ్ అలీ ఖాన్ సోదరి, నటి సోహా అలీ ఖాన్ ఈ జంటను సోషల్ మీడియాలో అభినందించారు. 
 
ఇంకా ఆమె సైఫ్ చిత్రాన్ని షేర్ చేసింది. దానికి "ది క్వాడ్ ఫాదర్" అని పేరు పెట్టారు. తన పోస్ట్‌లో, సోహా ఇలా వ్రాశారు: అభినందనలు కరీనా కపూర్. ఎప్పటిలాగే సురక్షితంగా, ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉండండి." అంటూ పేర్కొన్నారు.