ఎంత ధనవంతులైతే అంత కురచ దుస్తులు వేసుకుంటారా?
బాలీవుడ్ ప్రముఖ అర్బన్ ఖాన్ వెబ్ షో పించ్ వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ షొ తొలి ఎపిసోడ్‌లో హీరోయిన్ కరీనాకపూర్ నటిస్తోంది. ఆమె ఈ షో ద్వారా తనకు వచ్చిన ట్వీట్‌లను చదివారు. ఒక ట్వీట్‌లో 'ఎంత ధనవంతులైతే అంత కురచ దుస్తులు వేసుకుంటారా?' అని అడిగారు.
దీనిపై కరీనా కపూర్ సరిగ్గా కౌంటర్ ఇచ్చారు. తాము ఈ విధంగా డబ్బులు ఆదా చేస్తామన్నారు. పైగా ఇలా చేస్తున్నందునే ధనవంతులుగా ఉండగలుగుతున్నామని తెలిపారు. తాము మిగిలిన వస్తువులపై ఖర్చు చేస్తామని, దుస్తుల మీద అంతగా ఖర్చు చేయమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాగా తన కుమారుడు తైమూర్ ఇంకా రెండేళ్ల వాడేనని, అందుకే వాడిపై మీడియా దృష్టి పెట్టడం సరికాదన్నారు. సెలబ్రిటీల ఫీలింగ్స్‌ను పట్టించుకోకుండా చాలామంది వారిని తక్కువ చేసి మాట్లాడతారన్నారు. ఇటువంటివాటినన్నింటినీ సహించాల్సి వస్తుందని తెలిపారు.