సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (15:32 IST)

వంటలక్క పేరును అలా వాడేస్తున్న ఫ్యాన్స్?

కార్తీక దీపం సీరియల్‌లో దీప పాత్ర గురించి అందరికీ తెలిసిందే. కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది.

విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. అయితే దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించేలా నటించింది.ట
 
అయితే వంటలక్కగా పేరొందిన ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆమె అభిమానులు ఏకంగా టీస్టాల్స్‌కు దీప టీ స్టాల్ అని పెట్టుకొని ఆమె పేరుని తమ పబ్లిసిటీకి వాడేస్తున్నారు. గతంలో సినిమా తారల పేర్లను ఇలా వాడుకునేవారు. అయితే తాజాగా సీరియల్ నటుల పేర్లను కూడా ఇలా కమర్షియల్‌గా వాడుకోవడం చర్చనీయాంశమైంది.