'హలో'పై కత్తి మహేష్ రివ్యూ... అతడలా చేసి వుంటే ఎవరూ మాట్లాడేవారు కాదు...

శనివారం, 23 డిశెంబరు 2017 (14:29 IST)

Kathi Mahesh

కొత్త సినిమాలకు వెంటనే రివ్యూలు చెప్పి వివాదంలో ఇరుక్కునే కత్తి మహేష్ మరోసారి అలాంటి పనే చేశాడు. అక్కినేని అఖిల్ నటించిన 'హలో' సినిమాపై కత్తి మహేష్ చెప్పిన రివ్యూ ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. హలో సినిమాలో మొత్తం మనసంతా నువ్వే ప్రేమ కథా చిత్రం టైపులో ఉంది. అయితే ఆ సినిమాకు ఈ సినిమాకు అసలు పొంతనే లేదు. అఖిల్ సినిమాతో ఫ్లాప్‌తో ఇబ్బందిపడే అఖిల్‌కు ఈ సినిమా బాగా కలిసొస్తుంది. ఈ సినిమా చాలా బాగుంది.
 
అఖిల్, కళ్యాణిల కాంబినేషన్ అదిరిపోయింది. రమ్యక్రిష్ణ, జగపతిబాబుల యాక్షన్ సినిమాకు ప్లస్ పాయింట్. అనూప్ రూబెన్స్ సంగీతం మాత్రం బాగాలేదు. అనూప్ సంగీతం బాగా చేసి ఉంటే సినిమాపై ఎవరూ అస్సలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం సినిమాతో మ్యూజిక్ చేసిన తరువాత అనూప్ రూబెన్స్ తన సంగీతాన్ని పూర్తిగా మరిచిపోయినట్లున్నారు. సంగీతం మినహా సినిమా చాలా బాగుందంటూ కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు. చాలా రోజుల తరువాత ఒక సినిమా బాగుందని కత్తి మహేష్ సర్టిఫికెట్ ఇవ్వడం ఇప్పుడు తెలుగు విమర్శకులనే ఆశ్చర్యపరుస్తోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబలి 2'ని అధికమించిన తమిళ చిత్రం 'విక్రమ్ వేద'

భారత చలన చిత్రపరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రం 'బాహుబలి' సీక్వెల్ మూవీస్. ముఖ్యంగా ...

news

5 నిమిషాలకు రూ.5 కోట్లు తీసుకున్న వీడియో ఇదే

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఇపుడు బాలీవుడ్ కంటే ...

news

#kalyanipriyadarshan : ఒక్క చిత్రంతోనే ఎలా వాడుకోవాలో తెలుసుకున్నా...

మలయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్, హీరోయిన్ లిజిల ముద్దుల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్. ...

news

దర్శకుడిని బూటు కాలితో తన్నిన అడిషినల్ డీసీపీ (వీడియో)

హైదరాబాద్ నగరంలో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు పిలిచిన ...