సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 14 ఆగస్టు 2017 (16:16 IST)

'బిగ్ బాస్'పై పుస్తకం రాస్తా... మహేష్, ఆ పుస్తకంలో నాకో పేజీ ప్లీజ్... జూ.ఎన్టీఆర్

బిగ్ బాస్ తెలుగు షో నుంచి మహేష్ కత్తి, కల్పన ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. కాగా కత్తి మహేష్ 27 రోజులపాటు ఎలాగో బిగ్ బాస్ హౌసులో నెట్టుకొచ్చారు. తొలి జాబితాలోనే ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నా ప్రేక్షకుల మద్దతుతో కొనసాగాడు. ఇకపోతే శనివారంనాడు ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు షో నుంచి మహేష్ కత్తి, కల్పన ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. కాగా కత్తి మహేష్ 27 రోజులపాటు ఎలాగో బిగ్ బాస్ హౌసులో నెట్టుకొచ్చారు. తొలి జాబితాలోనే ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నా ప్రేక్షకుల మద్దతుతో కొనసాగాడు. ఇకపోతే శనివారంనాడు ఎలిమినేట్ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్‌తో ముచ్చటించాడు కత్తి మహేష్. 
 
ముళ్ల కుర్చీ కాన్సెప్ట్ గురించి ఇక్కడ నుంచి చూస్తే తేడాగా వుందనీ, ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ తెలుగు షోపై ఓ పుస్తకం రాయదలుచుకున్నానని వెల్లడించాడు. మహేష్ ఆ మాట అనేసరికి... జూనియర్ ఎన్టీఆర్ కలగజేసుకుంటూ... ఆ పుస్తకంలో నాక్కూడా ఓ పేజీ వుండేట్లు చూడరూ అంటూ సరదాగా అడిగారు. 
 
ఇకపోతే కత్తి మహేష్ ముంబై నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టులోకి రాగానే చాలామంది ఆయన్ను గుర్తు పట్టి సెల్ఫీలు కోసం ఎగబడ్డారట. దీంతో తను ఎంతగానో ఆశ్చర్యపోయాననీ, ఇదివరకు తనను ఎవరూ అంతగా పట్టించుకునేవారు కాదనీ, బిగ్ బాస్ షోతో తనకు గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు.