Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రభాస్‌కు జోడీగా వారిద్దరే సరి.. బాహుబలి ఎత్తుకు తగిన.. కత్తిలా వుంటారు..

మంగళవారం, 9 మే 2017 (18:00 IST)

Widgets Magazine

బాహుబలి సినిమాతో తన రేంజ్‌ను అమాంతం పెంచుకున్న ప్రభాస్.. తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. సాహో సినిమానే కాకుండా ఇకపై ప్రభాస్ నటించే సినిమాలు తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సాహో సినీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

రూ.150కోట్లతో భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం సుజిత్ వేట మొదలెట్టాడు. సుజిత్ హీరోయిన్ కోసం వేట ప్రారంభించాడని తెలిసి.. అప్పుడే సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభాస్‌కు తగిన మ్యాచ్‌ను పోస్ట్ చేసేశారు. ప్రభాస్ పక్కన కత్తిలా కనిపించాలంటే.. అనుష్కతో పాటు బాలీవుడ్ హీరోయిన్ కత్రినానే కరెక్ట్ అంటున్నారు. నెటిజన్లు వీరిద్దరు అయితేనే బాహుబలి ఎత్తుకు తగినట్లు.. కత్తిలా ఉంటారని అభిప్రాయ పడుతున్నారు. 
 
ప్ర‌భాస్ ప‌క్క‌న హీరోయిన్‌గా ఎవ‌రు బాగుంటార‌ని ఓ బాలీవుడ్ వెబ్‌సైట్ అభిమానులను ప్రశ్నించడంతో అనేకమంది కత్రీనాకు.. మరికొందరు అనుష్కకు ఓటేశారు. మరికొందరు దీపికా పదుకునే కూడా బాగుంటుందని కామెంట్స్ చేశారు. కాగా బాహుబలిలో అమరేంద్ర బాహుబలిగా దేవసేన మెచ్చిన ప్రభాస్‌కు ఆరువేల పెళ్లి  ప్రపోజల్స్ వచ్చాయి. ఆయన్ని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు వెంటపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాతో ప్రభాస్‌తో జతకట్టేందుకు బాలీవుడ్ హీరోయిన్లు సైతం సై అంటున్నారు. ఈ క్రమంలో కత్రినా మాత్రం కాదంటుందా? ఏంటి?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Prabhas Saina Nehwal Anushka Shetty Katrina Kaif Deepika Padukone Priyanka Chopra

Loading comments ...

తెలుగు సినిమా

news

అనుష్కకు పెళ్లి ఖరారు..? పెళ్లికొడుకు ఎవరబ్బా..?

ప్రముఖ దర్శకుడు జక్కన్న చెక్కిన అద్భుత విజువల్ వండర్స్ బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్లో ...

news

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న బాలకృష్ణ... ఇంతకాలం లైసెన్స్ లేదా?

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. నిజమా? ...

news

శర్వానంద్ - లావణ్య త్రిపాఠిల "రాధ"కు సెన్సార్ పూర్తి.. క్లీన్ 'యు' సర్టిఫికేట్

వరుస విజయాల హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్, లావణ్య త్రిపాఠిలు కలిసి నటించిన చిత్రం ...

news

శివగామిని శ్రీదేవి అంగీకరిస్తే... ప్రభాస్‌ను పట్టించుకునేవారే కాదు...

రాంగోపాల్ వర్మ మొత్తానికి శ్రీదేవి అభిమానిని అనిపించారు. శ్రీదేవి పట్ల తనకున్న అభిమానం ...

Widgets Magazine