ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (23:33 IST)

వైభవంగా కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ వివాహం.. ఫోటోలు వైరల్

Katrina Kaif and Vicky Kaushal
బాలీవుడ్ స్టార్స్ కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ వివాహం అట్టహాసంగా జరిగింది. గురువారం ఈ పెళ్లి జంట ఏడడుగులు వేసి సరి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ల పుకార్లకు ఈరోజు పెళ్లి వేడుకతో సరైన సమాధానం ఇచ్చారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
 
 
గురువారం రోజు ఈ పెళ్లి జంట ఏడడుగులు వేసి సరి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ల పుకార్లకు ఈరోజు పెళ్లి వేడుకతో సరైన సమాధానం ఇచ్చారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్టార్ సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. 
 
 
వీరి పెళ్లి వేడుకకు చాలా సెక్యూరిటీ నడుమ జరిగింది. ఫోటోలు బయటకు లీక్ అవ్వకూడదు అని ముందుగానే ఆంక్షలు విధించారు.. అంతేకాకుండా మొబైల్ ఫోన్లు ఎవరు కూడా తీసుకు రాకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Katrina Kaif and Vicky Kaushal
 
 
ఈ జంట చాలా అద్భుతంగా ఉంది అని నెటిజన్లతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా పాజిటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటికీ అదే ఆనందంతో కొనసాగాలి అంటూ పెళ్లి రోజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరి పెళ్లి కోసం ఒక ఓటీటీ సంస్థ వంద కోట్లకుపైగా ఆఫర్ చేసినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.


ఫోటోలు: ఇన్‌స్టాగ్రామ్ సౌజన్యం.