శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:16 IST)

కౌషల్ ప్రేమకథ... రక్తంతో ప్రేమలేఖ రాసాడు.. చివరికి ఏమైందంటే?

బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌కు ఇంకో వారం మాత్రమే కలిసుండే అవకాశం ఉంది. ఆ ఎఫెక్టో ఏమో ఎప్పుడూ గొడవపడుతుండే తనీష్, కౌషల్‌లు కూడా పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపించారు నిన్నటి ఎపిసోడ్‌

బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌కు ఇంకో వారం మాత్రమే కలిసుండే అవకాశం ఉంది. ఆ ఎఫెక్టో ఏమో ఎప్పుడూ గొడవపడుతుండే తనీష్, కౌషల్‌లు కూడా పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపించారు నిన్నటి ఎపిసోడ్‌లో. నీకేం లవ్ స్టోరీలు లేవా అని కౌషల్‌ను తనీష్ అడగగా, తన కాలేజ్ లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు కౌషల్. నేను ఇంటర్‌లో ఉండగా ఓ అమ్మాయిని ప్రపోజ్ చేశాను.
 
ఆ అమ్మాయి నా క్లాస్‌మేట్స్‌తో పాటుగా చాలామంది సీనియర్లు ప్రపోజ్ చేసినప్పటికీ ఎవరికీ పడలేదు. నాకు కూడా ప్రపోజ్ చేయాలనిపించి ఆ అమ్మాయికి ఒక లెటర్ రాసి ఇచ్చాను. ఆ లెటర్ చూసిన ఆ అమ్మాయి బాగా ఎమోషనల్ అయ్యింది, దానికి కారణం నేను ఆ లెటర్‌ను రక్తంతో రాసిచ్చాను. దీంతో ఫిదా అయిపోయిన అమ్మాయి నా దగ్గరకొచ్చి నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు కాని రక్తంతో ఎవరూ లెటర్ రాసివ్వలేదని చెప్పి నా లవ్ ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేసింది. అయితే మా సీనియర్స్‌లో ఒకరు నా దగ్గరకు వచ్చి... నేను ట్రై చేస్తే చాలామంది అమ్మాయిలు పడ్డారు, కానీ ఈ అమ్మాయి పడలేదు, అలాంటి అమ్మాయి నీకెలా పడిందంటూ ప్రశ్నించాడు.
 
ఇందులో ట్విస్ట్ ఏంటంటే లెటర్ రాసింది నా రక్తంతో కాదు, మా ఇంటి పక్కన పెద్ద కోళ్లఫారమ్ ఉండేది, రోజు అక్కడ కోళ్లను కోసి వాటి రక్తాన్ని ఓ గిన్నెలో పట్టేవారు. నేను వాళ్లకి ఓ చిప్ప ఇచ్చి దాంట్లో రక్తం ఇవ్వమని అడిగి తెచ్చుకుని ఆ రక్తంతో నాలుగు పేజీల లెటర్ రాసి ఆమెకు ఇచ్చేశా అంటూ చెప్పుకొచ్చారు కౌషల్. నిజంగానే ఇది కౌశల్ ప్రేమకథా లేక ఆయనకు అసలే క్రియేటివీ ఎక్కువ కాబట్టి, కుక్కకి కొత్త అర్థం చెప్పినట్లు లేదా నిన్న రాజు పులి కథ చెప్పినట్లు క్రియేట్ చేసారో తెలీక తనీష్, ఇంకా ప్రేక్షకులు తికమకపడ్డారు.