బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (19:42 IST)

'రాజుకు తగిన రాణి' - ప్రభాస్ - దీపికా కాంబినేషన్‌పై మహానటి కామెంట్స్ (video)

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ తన సొంత నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో గతంలో ఓ చిత్రం వచ్చింది. అది 'మహానటి'. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. సీనియర్ నటి దివంగత సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రను పోషించింది. అయితే, ఇపుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కనుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించారు. ఇది ప్రభాస్ కెరీర్‌లో 21వ చిత్రం. 
 
దీనిపై మహానటి ఫేమ్ కీర్తి సురేష్ స్పందించింది. 'బ్రహ్మాండమైన వార్త ఇది.. మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని సృష్టించడానికి ఓ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ జతకలిసింది. ఈ వెయింటింగ్‌ని భరించలేకున్నాను..' అంటూ కీర్తి సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేసింది. ఎటువంటి భేషజాలు లేకుండా కీర్తి సురేశ్ ఈ విధంగా వీరికి విషెస్ చెప్పడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
 
కాగా, ఈ పాన్ ఇండియా మూవీలో కథానాయికగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనెను ఎంపిక చేయడం పట్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమల సైతం ఆశ్చర్యపోయింది. ముఖ్యంగా, దీపికకు రికార్డు స్థాయిలో పారితోషికాన్ని ఇస్తూ ఆమెను ఈ ప్రాజక్టులోకి తెచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఈ కాంబినేషన్ పట్ల ప్రభాస్ అభిమానులు తెగ ఆనందపడిపోతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వారిలో ఇపుడు కీర్తి సురేష్ కూడా చేరిపోయారు.