శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శనివారం, 30 జూన్ 2018 (12:48 IST)

ముద్దులు విష‌యంలో క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్‌..!

నేను శైల‌జ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై... అన‌తి కాలంలోనే తెలుగు వారి హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మ‌ల‌యాళ భామ కీర్తి సురేష్‌. ఇటీవ‌ల మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర‌లో అద్భుతంగా న‌టించిన కీర్తి సురేష్ రాజ‌మౌళి భారీ మ‌ల్టీస్టార‌ర్లో

నేను శైల‌జ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై... అన‌తి కాలంలోనే తెలుగు వారి హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మ‌ల‌యాళ భామ కీర్తి సురేష్‌. ఇటీవ‌ల మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర‌లో అద్భుతంగా న‌టించిన కీర్తి సురేష్ రాజ‌మౌళి భారీ మ‌ల్టీస్టార‌ర్లో అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎంత‌టి స్టార్ హీరోయిన్ అయినా సినిమాలో న‌టించేట‌ప్పుడు గ్లామ‌ర‌స్ రోల్‌లో న‌టించాల్సి రావ‌చ్చు. ముద్దులు పెట్టాల్సి రావ‌చ్చు.
 
అయితే... కీర్తి సురేష్ మాత్రం ముద్దుల‌కు, గ్లామ‌ర‌స్ రోల్స్‌కి దూరం అంటోంది. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ... `న‌లుగురి ఎదుట రొమాన్స్ చేయడం నావ‌ల్ల కాదు. నాకు సిగ్గు చాలా ఎక్కువ‌. ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌డం నావ‌ల్ల కాదు. అయినా... ఇప్పటివ‌ర‌కు ముద్దు స‌న్నివేశాల్లో న‌టించాల‌ని, గ్లామ‌ర‌స్ దుస్తుల్లో క‌నిపించాల‌ని న‌న్నెవ‌రూ అడ‌గ‌లేదు అని చెప్పింది. ఒక‌వేళ అడిగినా ఎలాంటి మొహ‌మాటం లేకుండా నో అని చెప్పేస్తానంటోంది.