కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్
జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ 2025లో బ్లాక్ బస్టర్ సంవత్సరానికి సిద్ధమవుతోంది. బహుళ భాషలలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఆమె ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే కీర్తి నటించిన రివాల్వర్ రీటా సినిమా కూడా విడుదలకు ముందే భారీ అంచనాలను సృష్టించిందని టాక్.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ బోల్డ్‌గా నటించింది. తాజాగా కీర్తి యష్ రాజ్ ఫిల్మ్స్‌తో కలిసి 'అక్క' సినిమా చేసింది. అలాగే ఓ బాలీవుడ్ సినిమాలోనూ సంతకం చేసింది. ఇంకా కీర్తి ఖాతాలో మరో బిగ్ తెలుగు సినిమా కూడా చేరిందని టాక్. ఇంకా ప్రకటించని మరో ప్రాజెక్ట్ త్వరలో వార్తల్లోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా కీర్తి సురేష్ 2025లో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుందని టాక్.
పెళ్లి తర్వాత కీర్తి ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఆప్డేట్స్ ఇస్తుంటుంది. పెళ్లి తర్వాత వరుస ఫోటో షూట్స్‌తో మతి పోగొడుతోంది. కీర్తి సురేష్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాయ్ హెయిర్ స్టైల్‌లో కనిపించి కీర్తి షాకిచ్చింది. అయితే ఇవి ఏఐ ఫోటోలని తెలిసింది.