మహానటికి మంచి ఆఫర్ వచ్చింది..

Last Updated: గురువారం, 6 డిశెంబరు 2018 (17:17 IST)
మహానటికి తర్వాత కీర్తి సురేష్ మరో తెలుగు సినిమాలో నటించేందుకు ఒప్పుకుందట. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరించే తెలుగు సినిమాలో కీర్తి సురేష్ నటించనుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది కీర్తికి తెలుగులో మహానటి మంచి పేరు సంపాదించి పెట్టింది. 
 
అలాగే తమిళంలోనూ, తెలుగులోనూ విడుదలైన పందెం కోడి-2, సర్కార్ భారీ సక్సెస్‌లను సంపాదించిపెట్టాయి. ఈ సినిమాలు మంచి కలెక్షన్లను సాధించాయి. మహానటి తర్వాత బయోపిక్‌లే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. 
 
ఈ క్రమంలో తమిళనాడు సీఎం జయలలిత బయోపిక్‌లో కీర్తికి నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఆ అవకాశాన్ని వద్దనుకున్న కీర్తి.. జయమ్మ లాంటి పాత్రలో తాను కనిపించడం కష్టమని చెప్పేసింది. ఇంకా హీరోలతో జోడీ కట్టే పాత్రలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్న కీర్తి సురేష్.. తాజాగా నాయికా ప్రాధాన్యత కలిగిన ఓ తెలుగు సినిమా కోసం సంతకం చేసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.దీనిపై మరింత చదవండి :