మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (20:18 IST)

బాత్రూమ్‌లో శవంలా కనిపించిన మోడల్ కమ్ నటి

deadbody
మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన మోడల్ కమ్ నటి షహానా బాత్రూమ్‌లో శవమై కనిపించింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈమె మలయాళ చిత్రపరిశ్రమలో పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు. 
 
గత యేడాది సజ్జద్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని అత్తమామలతో కలిసి కోళికోడ్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి బాత్రూమ్‌లో శవమై కనిపించింది. పైగా, మే 12వ తేదీన షహానా పుట్టినరోజు కావడం గమనార్హం. 
 
ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేసిన తల్లిదండ్రులకు చావు కబురు విని దిగ్భ్రాంతికి గురయ్యారు. తన కుమార్తె చనిపోయేంత పిరికిరాలు కాదని, తమ బిడ్డ మృతికి అల్లుడే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.