శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (15:54 IST)

తొలిరోజే 22 కోట్లు రాబట్టిన 'కేసరి'

బాలీవుడ్ వైవిధ్య నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా 'కేసరి' దేశవ్యాప్తంగా గురువారం విడుదలైంది. ఈ సినిమాను దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. 2019లో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఓపెనర్ సినిమాగా నిలిచింది. విడుదలైన తొలిరోజే ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. 
 
గురువారం విడుదలైన ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ధర్మ ప్రొడక్షన్స్‌లో మొదటి రోజే ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాను 1897లో జరిగిన సారంగడి యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో అక్షయ్ కుమార్ హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించాడు. అక్షయ్ కుమార్‌కు జోడీగా పరిణీతి చోప్రా నటించారు. విడుదలైన తొలి రోజే 22 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇలాగే బాగా ఆడితే భారతదేశంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల సరసన నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.