ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (21:44 IST)

ఎన్టీఆర్‌కి రెండు వెన్నుపోట్లు... అదే లక్ష్మీస్ వీరగ్రంథం...

నాగరిషీ ఫిలిమ్స్ బ్యానర్ పైన విజయ కుమార్ గౌడ్ సమర్పణలో, జయం మూవీస్ సారథ్యంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ వీరగ్రంథం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఒక తెర వెనుక యదార్థ గ్రంథాన్ని ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తెస్తాం అంటూ కేతిరెడ్డి తెలిపారు. 
 
ఈ చిత్రంలో నేటి రాజకీయ వ్యవస్థ లోని లోపాలు, వయస్సు వ్యత్యాసమున్న మహిళ తన సంసార జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ప్రేమ పూర్వకంగా, అన్నీ త్యజించిన ఓ వ్యక్తిని మరలా దాంపత్య జీవితం వైపు ఆకర్షితుడిని చేసేందో తెలుపడం జరిగిందని వెల్లడించారు.
 
దేశ రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా రెండుసార్లు వెన్నుపోట్లకు  గురి అయిన ముఖ్యమంత్రి జీవితాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఇందులో హీరోయిన్‌గా వివాదాలకు కేంద్ర బిందువైన శ్రీరెడ్డి నటిస్తుంది.