బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (09:00 IST)

కేజీఎఫ్ హీరోతో పునీత్ రాజ్ డ్యాన్స్.. అంతలోనే...

KGF_Puneeth
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టివేసింది. కాగా నిన్నటి వరకు ఎంతో యాక్టివ్‌గా ఉన్న పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడం అంతలోనే మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
అంతేకాకుండా రెండు రోజుల క్రితమే పునీత్ రాజ్ కుమార్ కన్నడ స్టార్ హీరో యష్‌తో కలిసి ఓ స్టేజ్‌పై స్టెప్పులు వేశారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన జై భజరంగి 2 సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు రోజుల క్రితం జరిగింది. ఈ ఈవెంట్‌కు హీరో యష్, పునీత్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా పునీత్ రాజ్ కుమార్… శివరాజ్ తోపాటు యష్‌తో స్టెప్పులు వేశారు.
 
 కాగా ఈ రోజు పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా మృతి చెందడంతో స్టేజీపై హీరో యష్‌తో కలిసి చేసిన డ్యాన్స్, ఆయనతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసుకుంటూ పునీత్ రాజ్ కుమార్ ను మిస్ అవుతున్నాం అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.