శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (15:48 IST)

కేజీఎఫ్ చాఫ్టర్-2 కోసం ఏడు సినిమాలు వదులుకున్నా.. ఎవరు?

కేజీఎఫ్ చాఫ్టర్-2 కోసం ఏడు సినిమాలు వదులుకుందట.. కేజీఎఫ్ ఛాప్టర్-1 హీరోయిన్.. శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ చాప్టర్-1కి తర్వాత తన కెరీర్ ఒక్కసారిగా మారిపోయిందని.. కన్నడ నుంచి మూడు సినిమాలు, తెలుగు నుంచి రెండు, తమిళం నుంచి రెండు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 
 
అయితే 'కేజీఎఫ్ చాఫ్టర్ 2' కోసం జూన్ నుంచి అక్టోబర్ వరకూ డేట్స్ ఇచ్చాను. ఆ మధ్యలోనే తనకు డేట్స్ కావాలని ఈ ఏడు సినిమాలవారు అడిగారు. అయితే తనకు 'కేజీఎఫ్ చాఫ్టర్ 2' చాలాముఖ్యం. అందుకే ఈ ఏడు సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని శ్రీనిధి చెప్పుకొచ్చింది. 
 
కాగా.. ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ సినిమా కేజీఎఫ్ బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన''యష్'' క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి క్రేజ్ కూడా అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.