1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (17:12 IST)

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న 'ఖైదీ నెం.150' ఆడియో.. 'అమ్మడు.. కుమ్ముడు'కు మిలియన్ల వ్యూస్

ఆడియో రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి మరెన్నో సూపర్‌హిట్‌ ఆల్బమ్స్‌ని అందించిన సంస్థగా పేరు తెచ్చుకున్న లహరి మ్యూజిక్‌ మళ్ళీ వరసగా సూపర్‌ డూపర్‌హిట్‌ ఆడియోలను ప్రేక్షకులకు అందిస్తూ విజయపథంలో దూసుకెళ్త

ఆడియో రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి మరెన్నో సూపర్‌హిట్‌ ఆల్బమ్స్‌ని అందించిన సంస్థగా పేరు తెచ్చుకున్న లహరి మ్యూజిక్‌ మళ్ళీ వరసగా సూపర్‌ డూపర్‌హిట్‌ ఆడియోలను ప్రేక్షకులకు అందిస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న ఈ సంస్థ తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మక మూవీ 'ఖైదీ నెం.150' చిత్రం ఆడియోను విడుదల చేసింది. ఈ చిత్రం ఆడియోకి శ్రోతల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రానికి ఉన్న క్రేజ్‌, దేవిశ్రీప్రసాద్‌ అందించిన ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఈ ఆడియో ఘనవిజయం సాధించడానికి దోహదపడ్డాయి. ఈ చిత్రం ఆడియోపరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 
 
'ఖైదీ నెం.150' చిత్రం ఆడియోకి వస్తోన్న రెస్పాన్స్‌పై లహరి మ్యూజిక్‌ అధినేత మనోహర్‌నాయుడు స్పందిస్తూ.. ''మెగాస్టార్‌ చిరంజీవి మాస్టర్‌, హిట్లర్‌, మెకానిక్‌ అల్లుడు, ముఠామేస్త్రి, ఆపద్బాంధవుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్‌ లీడర్‌, ముగ్గురు మొనగాళ్ళు వంటి బ్లాక్‌బస్టర్‌ ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్‌ చేశాం. ఈ చిత్రాలు మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఇప్పుడు చిరంజీవి కెరీర్‌లోనే ప్రతిష్ఠాత్మక చిత్రంగా రూపొందుతున్న 'ఖైదీ నెం.150' చిత్రం ఆడియోను కూడా మా సంస్థ ద్వారానే రిలీజ్‌ చెయ్యడం మాకెంతో గర్వంగా వుంది. 
 
ఇప్పటికే విడుదలైన పాటలు యూ ట్యూబ్‌లో కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాయి. 'అమ్మడు.. కుమ్ముడు..' పాటకు 7 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ అయ్యాయి. 'సుందరీ..' పాట 4 మిలియన్‌ వ్యూస్‌కి చేరుకుంటుండగా, 'యు అండ్‌ మి' పాట 1 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ చేసింది. ఈ చిత్రంలోని 'రత్తాలు.. రత్తాలు..' అనే ఐటమ్‌ సాంగ్‌ను డిసెంబర్‌ 31న విడుదల చేస్తున్నాం. అదే రోజు ఈ చిత్రంలోని అన్ని పాటలు యూ ట్యూబ్‌ జూక్‌బాక్స్‌లో అందుబాటులోకి వస్తాయి. 
 
మెగాస్టార్‌ చిరంజీవిగారి 150వ సినిమా రిలీజ్‌కి ముందే ఆడియో పరంగా ఇండస్ట్రీ రికార్డులు సృష్టిస్తోంది. ఇంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ఆడియోను రిలీజ్‌ చేసే అవకాశం ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవికి, డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌గారికి, నిర్మాత రామ్‌చరణ్‌కి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌గారికి, ఈ ఆడియోను ఇంత పెద్ద హిట్‌ చేసిన తెలుగు ఆడియన్స్‌కి, మెగాస్టార్‌ అభిమానులకు ధన్యవాదాలు'' అన్నారు.