శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (10:33 IST)

బాస్ ఈజ్ బ్యాక్.. ప్రీమియర్ షోలు పూర్తి కాకుండానే రూ.6.7కోట్లు కొల్లగొట్టిన ఖైదీ..

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగే పండుగ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ నెం 150' చిత్రం విడుదలైంది. తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా యూఎస్ఏలో ప్రీమియర్ షో పడింది.

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగే పండుగ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ నెం 150' చిత్రం విడుదలైంది. తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా యూఎస్ఏలో ప్రీమియర్ షో పడింది. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. యూఎస్ఏలో సినిమా చూసిన వారి నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. 
 
సినిమాకు పాజిటివ్ టాక్‌ వచ్చేసింది. ఖైదీ నెం. 150 యాక్షన్ థ్రిల్లర్‌గా.. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రాన్ని తెలుగులో రీమేక్ అయింది. ఇందులో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించారు. సినిమా కథ ముఖ్యంగా... జైలు నుండి తప్పించుకున్న ఖైదీ చుట్టూ కథ తిరుగుతూ చుట్టూ తిరుగుతుంది. జైలు నుండి తప్పించుకున్న తర్వాత విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు కానీ ఎయిర్ పోర్టులో ఒక అమ్మాయి(కాజల్ అగర్వాల్)ని కలిసిన తర్వాత తన నిర్ణయం మార్చుకుంటాడు. ఇలాంటి వ్యక్తి రైతుల కోసం పోరాడేందుకు నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏమిటి? అనే తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే. 
 
ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ బుధవారం విడుదలైన 'ఖైదీ నంబర్ 150' చిత్రం ప్రీమియర్ షోలు పూర్తి కాకుండానే అమెరికాలో మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6.7 కోట్లు) వసూలు చేసింది. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్ శంకర్, హాస్య నటుడు వెన్నెల కిషోర్‌లు తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉందన్న రివ్యూలు వస్తుండటంతో, ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో శుక్రవారం నుంచి మరిన్ని షోలు వేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోందని చెబుతూ, హీరోయిన్ కాజల్ థియేటర్‌లో అభిమానులు సందడి చేస్తున్న చిత్రాన్ని షేర్ చేసుకుంది. చిత్రం సూపర్ హిట్ అయిందని ఓ అభిమాని చేసిన ట్వీట్ ను సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ రీట్వీట్ చేశాడు. తప్పకుండా ఖైదీ బాహుబలి రికార్డును బ్రేక్ చేస్తాడని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.